హైదరాబాద్: ఆర్థిక సంస్కరణల రూపకర్త, పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) మృతిపట్ల మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి సీతక్క శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి సీతక్క(Minister Seethakka) తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్(Congress) మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మో హన్ రెడ్డి, ఇందిరా శోభన్, ఇతర నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (92) కన్నుమూసిన విషయం తెలిసందే.