calender_icon.png 24 September, 2024 | 5:57 PM

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి సీతక్క

24-09-2024 03:20:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగళవారం కలిశారు. ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మరుస్తూ 2022లో గత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కానీ ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలేదని, ఇప్పుడు ఆ బిల్లుతో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం తెలుపాలని కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని కోరినట్లు ఆమె వెల్లడించారు. జిష్ణు దేవ్ వర్మకు ములుగులో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సీతక్క చెప్పారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్ కు పంపించామని, ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసిందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.