హైదరాబాద్: టీజీ ఫుడ్స్ కార్పొర్పేషన్ పనితీరుపై మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లేని, శుభ్రత లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారు. అంగన్వాడి చిన్నారులకు సరఫరా చేసే బాల అమృతం ను తయారీ చేస్తున్న టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందని సూచించారు. బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని హెచ్చరించారు. నాసి రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై పట్ల చర్యలు తీసుకుంటామన్నారు.