calender_icon.png 24 December, 2024 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకో న్యాయం.. మీకో న్యాయమా..?

31-07-2024 06:21:50 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందర గోలం నెలకోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష మహిళ ఎమ్మెల్యేలను అవమానించారని బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగ్గారు. సభలో సీఎం ఎవరి పేరు ప్రస్తావించలేదని, కేవలం వెనక అని మాత్రమే అన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వెనక అంటే బయట కావచ్చు.. ఎక్కడైనా కావచ్చు అని చెప్పారు. సభలో అని ఎక్కడా అనలేదని, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా రాద్దాంతం చేస్తోందని సీతక్క ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మహిళా గవర్నర్ ను పరుషంగా మాట్లాడితే ఎందుకు స్పందించలేదు..? నాకు జ్ఞానం లేదని కౌశిక్ రెడ్డి అన్నారు.. దానికి క్షమాపణ చెప్పారా..? అని ప్రశ్నించారు. మాకో న్యాయం.. మీకో న్యాయమా..? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.