calender_icon.png 24 December, 2024 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్‌లో జరిగిన ఘటనపై మంత్రి సీతక్క విచారం

31-07-2024 08:10:45 PM

కేరళ: వయనాడ్ లో జరిగిన ఘటనపై మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని, ఆపదలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత ఆమె పేర్కొన్నారు. వయనాడ్ లో వరదల వల్ల  కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంత్యంత హృదయ విషాదకర ఘటనతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమన్నాయని, చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామన్నారు. కాంగ్రెస్ పార్టీకి, నాకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక అనుబందం ఉందని, వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీతక్క పిలునిచ్చారు.