హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువతలో రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 3కె రన్ ప్రారంభానికి ముందు మంత్రి సీతక్క ప్రముఖ సినిమా డీజే టిల్లు(DJ Tillu Song)లోని ఓ పాటకు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్‌లో పాల్గొన్న యువకులలో ఉత్సాహాన్ని నింపింది. ఆమె డ్యాన్స్‌ను చూసిన యువత పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలతో ఆమెను ఉత్సాహపరిచారు. సీతక్క డాన్స్ వీడియో(Seethakka Dance Video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.