హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస పార్టీదన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకని మీరు అనలేదా? అని ప్రశ్నించారు. సాగులేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. మీరు ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని విమర్శించారు. పట్టా ఉన్నవారికే రైతుబంధు ఇచ్చారని మండిపడిన మంత్రి సీతక్క ఫామ్ హౌస్ లో ఉన్నవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలా? అని ప్రశ్నించారు.