calender_icon.png 28 November, 2024 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్

28-11-2024 02:00:56 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లా దివావర్ పూర్ కు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఇథనాల్ పరిశ్రమకు అన్ని  అనుమతులను కేసీఆర్, కేటీఆరే ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు.. కేటీఆర్.. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దాం. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేలుద్దామన్నారు. అనుమతులిచ్చే నాటికి కంపెనీ డైరెక్టర్ గా తలసాని సాయి, ఇథనాల్ కంపెనీ మరో డైరెక్టర్ గా పుట్టా సుధాకర్ కుమారుడు  ఉన్నారని సీతక్క తెలిపారు. పుట్టా సుధాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులని తెలిపారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులిచ్చారని వెల్లడించారు. దిలావర్ పూర్ వచ్చేందుకు సిద్ధమా? కాదా? కేటీఆర్ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. హాస్టళ్లలో వరస ఘటనల వెనక కుట్ర ఉందని భావిస్తున్నాం.. కుట్రలపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని స్పష్టం చేశారు. కుట్రలకు పాల్పడే అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అవసరమైతే అధికారులను సర్వీసు నుంచి తొలగిస్తామన్న మంత్రి సీతక్క అన్ని విషయాలను ఆధారాలతో బయటపెడతామని పేర్కొన్నారు. హాస్టళ్లలో ఘటనల వెనక తమకు అనుమానాలున్నాయన్నారు.