calender_icon.png 29 November, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం తపిస్తున్నారు: మంత్రి సీతక్క

29-11-2024 03:57:15 PM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల కోసం తపిస్తున్నారని చెప్పారు. లగచర్ల ఘటనలో ఎస్సీ, ఎస్టీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటన వెనక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని తెలిపారు. హాస్టళ్లలో వరస ఘటనల వెనక బీఆర్ఎస్ హస్తముందని తమకు అనుమానం ఉందని మంత్రి వెల్లడించారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీఎం విచారణ చేయించాలని సీతక్క కోరారు. ప్రభుత్వం ఏ పని చేసినా ఆందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.