calender_icon.png 12 March, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తశుద్ధితో ఆడవాళ్ళు దేన్నయినా సాధించగలరు..

11-03-2025 10:11:09 PM

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఉమెన్స్‌ డేలో మంత్రి సీతక్క..

ముషీరాబాద్ (విజయక్రాంతి): చిత్తశుద్ధితో లక్ష్యంపై గురిపెడితే ఆడవాళ్ళు దేన్నయినా అందుకోగలరని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(Telangana American Telugu Association) మహిళా ఫోరం ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఉమెన్స్‌డే ఉత్సవాలు అధ్యక్షులు మల్లిపెద్ది నవీన్‌రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ముఖ్య అతిథిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళా సాధికారత కోసం ఆమె చేసిన పోరాటాన్ని వివరించారు.

ప్రత్యేక అతిథులుగా ఐపిఎస్‌ అధికారిణి సుమతి బడుగుల, సీత పల్లచొల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మల్లిపెద్ది నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి సలహా కమిటీ అధ్యక్షుడు డా. విజయపాల్‌ రెడ్డి, సహాధ్యక్షులు డా. మోహన్‌ రెడ్డి పటోళ్ళ, సభ్యులు భరత్‌ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, మాజీ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్లల ప్రోత్సాహం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమాకి అవిశ్రాంతంగా కృషి చేసినందుకు టిటిఎ మహిళా కమిటీ సలహాదారు పల్లవి రెడ్డి రామిడి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కవితా రెడ్డి, మీడియా కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ దీపికా రెడ్డి నల్ల, జనరల్‌ సెక్రటరీ శివరెడ్డి కొల్లా, జాయింట్‌ సెక్రటరీ నిశాంత్‌ సిరికొండ, ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నర్సింహ పెరుక, డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ చింత, సేవా డేస్‌ కో-ఆర్డినేటర్‌ విశ్వ కంది, వెబ్‌ కమిటీ నరేందర్‌ రెడ్డి యరవ, షార్లెట్‌ బృందం లక్ష్మీకాంత్‌ రామిడి, రమేష్‌ చింతకుంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వర్చువల్‌ సమావేశం మహిళల గొప్ప విజయాలను గుర్తించి, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేసే వేదికగా నిలిచిందన్నారు.