calender_icon.png 1 November, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే వినోద్ కు మంత్రి పదవి కేటాయించాలి

07-07-2024 03:14:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు రాష్ట్ర కేబినెట్లో అవకాశం కల్పించి మంత్రి పదవి కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి జమ్మికుంట విజయ్ కుమార్ కోరారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పాలకుల హయంలో బె లంపల్లి నియోజకవర్గంలో పూర్తిగా వెనుకబడిందన్నారు. మచ్చలేని నాయకుడుగా వినోద్ కు ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు.

భూ కబ్జాలు లేకుండా రాజకీయాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే వినోద్ కు మంత్రి పదవి కేటాయిస్తే బెల్లంపల్లి నియోజకవర్గం తో పాటు మంచిర్యాల జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు కర్నూలు వెంకన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరెపల్లి వేణు, మార్కెట్ కమిటీ సభ్యులు దె బ్బటి రమేష్, ఎస్సీ సెల్ నాయకులు దుర్గంమహేందర్ సుబ్రహ్మణ్యం పంబాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు