calender_icon.png 15 October, 2024 | 7:59 PM

గురుకుల భవన యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్

15-10-2024 05:35:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనలో నిర్వహిస్తున్న మైనార్జీ రెసిడెన్షియల్ పాఠశాలకు అద్దె చెల్లించకపోవడంతో మంగళవారం బిల్డింగ్ యజమానులు తాళాలు వేశారు. గురుకులాలకు తాళాలు వేయడంపై రావాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఎమరో మాటాలు విని గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రేపో, మాపో రెసిడెన్షియల్ పాఠశాలకు అద్దె చెల్లించేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు.

గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడం ఏమాత్రం సమంజసం కాదని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి కూడా 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయన్నారు.  గురుకుల పాఠశాలల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నంటూ గురుకులాలలో పెట్టిన బ్యానర్లు వెంటనే తొలగించాలని కోరారు. బాకాయిలను చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రతి ఒక్కరికీ బకాయిలను ఇప్పించే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు. గురుకుల ప్రిన్సిపల్ అర్సీవోలు ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు చేయండి.. క్రిమినల్ చర్యలు తీసుకోండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.