హుస్నాబాద్, జనవరి 17 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో వివిధ కారణాలతో మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇటీవల మరణించిన లెంకల రాజయ్య, రంగు లక్ష్మినారాయణ, ఎర్రవెల్లి బాల కిష్టయ్య కుటుంబ సభ్యులతోపాటు కోహెడకు చెందిన బుర్ర ప్రశాంత్, తీగలకుంటపల్లికి చెందిన కుక్కర్ల బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.