calender_icon.png 25 December, 2024 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీని సందర్శించిన మంత్రి పొన్నం

25-12-2024 12:00:00 AM

కరీంనగర్, డిసెంబర్24(విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలను సందర్శించిన రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ కేజీబీవి ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాల సగం మంది ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా విధుల్లో ఉన్నవారు అన్ని తరగతులు జరిగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

ఇప్పటికే పూర్తున పాఠాలను చడవడంతో పాటు ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల పరీక్షలు సమీపిస్తుండటం, ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడం దృష్ట్యా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించా లన మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తక్షణమే సమ్మె  విరమించి విధుల్లోకి హాజరుకావాల ని  కేజీబీవీ సమ్మె చేస్తున్న  రాష్ర్ట నాయకు లతో విద్యాశాఖ ఉన్నతాధికారులతో పోన్ లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కేజీబీవీ పాఠశా లలో ప్రతి తరగతిలో విద్యార్థినులతో ముచ్చటించారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన తరువాత అందుతున్న ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందుతుందని మెనూ ప్రకారంకూరలు, ఇతర ఆహార పదార్థాలు అందుతున్నాయని తెలిపిన విద్యార్థులు. పాఠశాల వంటగది నీ పరిశీలించారు.. విద్యార్థులకు మధ్యాహ్నం వండిన వంటలు అన్నం కూరలను పరిశీలించారు. అక్కడే ఉన్న కూరగాయలను పరిశీలించారు.. వంటకు ఉపయోగించే వస్తువులు నాణ్యత లొ రాజీ ఉండకూడదని ఆదేశించారు...విద్యార్థులకు అందుతున్న అరటి పండ్లను పరిశీలించారు.

కేజీబీవీ స్కూల్ పరిసరాలను పరిశీలిం చారు.. స్కూల్ గ్రౌండ్ ఆవరణలో బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో  మునగ, జామ, నిమ్మ ,కరివేపాకు తదితర ఉపయోగపడే మొక్కలు నాటాలని సూచించారు. ప్రహరీ గోడ వద్ద ఉన్న పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయా లని అధికారులను ఆదేశించారు.