22-04-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్,ఏప్రిల్21(విజయక్రాంతి):రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జి అమీర్ అజ్జు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫాహద్, గుర్రం వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు తాళ్లపల్లి శ్రీకాంత్, బత్తిని విష్ణు, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిల్, మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్, మండల అధ్యక్షులు గట్టు ప్రశాంత్, నాయకులు పొన్నం మధు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.