సిద్దిపేట: హుస్నాబాద్ లో ప్రజాపాలన వార్డు సభను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) గురువారం సందర్శించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించామని మంత్రి పొన్నం ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరిగేలా సాఫ్ట్‌వేర్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ జరగని వారికి మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.