ఓట్ల కోసం కుటుంబ సర్వే చేయట్లేదు: మంత్రి పొన్నం
బాధ్యతతో సర్వే చేస్తున్నాం
ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చు
హైదరాబాద్: కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజుతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారికి గోపూజ నిర్వహించి కోడే మొక్కులు చెల్లించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ కార్డు వివరాలు సేకరించట్లేదని వెల్లడించారు. ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చని మంత్రి సూచించారు. వివరాలు చెప్పడం ఇష్టం చేగుంటే 999 ఎంపిక ఉంటుందన్నారు. ఎన్యూమరేటర్లు విదులకు ఆటంకం కలిగిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వేను వ్యక్తిగతంగా వాడుకున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. గతంలో చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని పేర్కొన్నారు. గతంలో చేసిన సర్వే వివరాలు ఎక్కడున్నాయో తెలియదని చెప్పారు.