calender_icon.png 18 January, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక సూచనలు

17-01-2025 04:29:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26వ తేదీ నుంచి అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పేర్కొన్నారు. సైదాపూరం మండలం దద్దెనపల్లి, ఎగ్లాస్పూర్, గర్రెపల్లి, సోమవారం, వెన్నంపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యాటించారు. ఈ సందర్వంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ... కుల సర్వే సమచారం ఆధారంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఈ అంశంలో అపోహలు వద్దని రాష్ట్ర ప్రజానీకానికి మంత్రి పొన్నం సూచించారు. రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, ఇప్పటికే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియపై గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు.

అర్హత లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయవద్దని అధికారులను హెచ్చరించారు. గత పదేళ్లుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లైనవారికి కొత్త కుటుంబాలకు మార్పులు, చేర్పులు చేసి అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు లేనివారికి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.