09-12-2024 12:15:40 PM
తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వపరంగా లేదు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రావడానికి కారణం సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదన్నారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధించినవని ఆరోపించిన మంత్రి పొన్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా విగ్రహం తయారు చేసినట్లు వివరించారు. ఇటీవల వరదలు వస్తే కేంద్రం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చిందని ఆరోపించిన పొన్నం ప్రభాకర్ కేంద్రం నుంచి నిధుల సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరారు.