calender_icon.png 30 April, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికులతో సమాలోచనలకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి పొన్నం

30-04-2025 07:20:12 PM

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నోటీసు(RTC Strike Notice)పై బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పునరాలోచించాలని కోరారు. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందని, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులతో సమాలోచనలకు తాను సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.