హైదరాబాద్: ప్రతిపక్షాల ఛార్జిషీట్లను విజ్ఞప్తులుగా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఛార్జిషీట్లను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ ఆదివారం ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ వేదికైంది. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పాలనలో సమాజంలోని ఏ వర్గానికీ ప్రయోజనం లేదని చార్జిషీట్ విడుదల చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ సవివరమైన ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అధికారం కోసం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు సంబంధించి ఆరు అబద్ధాలు, 66 మోసాలు అనే థీమ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి చార్జిషీట్‌ను ఆవిష్కరించారు. మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రజలను నమ్మించిందని, అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమై ద్రోహం చేసిందని ఆరోపించారు.