calender_icon.png 3 February, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై విమర్శలు.. బీసీలపై దాడిగానే చూస్తాం: మంత్రి పొన్నం

03-02-2025 01:27:54 PM

కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెడతాం

బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు

కులగణనపై విమర్శలు చేసేవారు.. పునరాలోచించుకోవాలి

హైదరాబాద్: కులగణన(Telangana Caste Census)పై విమర్శల దాడిని బీసీలపై దాడిగానే చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. కులగణనపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని కోరారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులో కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

కులగణనకు స్ఫూర్తినిచ్చిన రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కులగణనకు కొన్ని కుటుంబాలు సహకరించలేదని చెప్పిన మంత్రి పొన్నం కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెడతామన్నారు. కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కులగణనలో ఎమ్మెల్సీ కవిత సమాచారం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister KCR) కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే సమాచారం ఇచ్చారని వివరించారు.

తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

🔸తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554.. మొత్తం కుటుంబాలు 1,12,15,134

🔸కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319.. 17.43 శాతం

🔸ఎస్టీల జనాభా  37,05,929.. 10.45 శాతం

🔸బీసీల జనాభా  1,64,09,179.. 46.25 శాతం

🔸బీసీ ముస్లింలు  35,76,588.. 10.85 శాతం

🔸ఓసీ ముస్లింలు 8,80,424.. 2.48 శాతం.. 

- మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%

🔸ఓసీల జనాభా శాతం 15.79%