హైదరాబాద్: అక్కన్నపేట మండల కేంద్రంలో భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం(Mahalakshmi Scheme), ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాల పటిష్ఠం, కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యమన్నారు. విద్య వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తుందని వెల్లడించారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.