calender_icon.png 11 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్, కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

07-12-2024 01:37:21 PM

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని కలిసి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టితో కలిసి ఆహ్వానించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

రాజ్ భవన్ దిల్ కుశా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ఆహ్వాన పత్రిక అందించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మంత్రి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు.