కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆరా తీసి, పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడారు. 2025 సంవత్సరంలో అంత మంచే జరుగుతుంది. హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతంపై పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో సర్పంచ్ లుగా కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు గ్రామాల్లో కష్టపడి పని చేయాలని, నియోజకవర్గంలో విద్యా, వైద్యం సాగునీరు అందించడం తొలి ప్రాధాన్యతగా ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.