calender_icon.png 3 October, 2024 | 4:55 PM

ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

03-10-2024 02:06:15 PM

కరీంనగర్, (విజయక్రాంతి): ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తహేర్ కొండాపూర్ లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్వయంగా తాహేర్ కొండాపూర్ గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు ఫోటో తదితర వాటి వివరాలు సేరించారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో , ఎంపిడివో ,ఇతర అధికారులు,కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.