calender_icon.png 19 April, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా బీజేపీ మాట్లాడదు

17-04-2025 10:13:32 AM

  1. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే: మంత్రి పొన్నం
  2. సీబీఐ, ఈడీపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుంది
  3. రాజకీయ ప్రత్యర్థులను కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు
  4. గాంధీ కుటుంబానికి దేశం మొత్తం అండ

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) గురువారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎల్లమ్మ చెరువు కట్ట(Yellamma Cheruvu works) సుందరీకరణ పనులను మంత్రి పొన్నం(Ponnam Prabhakar) పరిశీలించారు. ఈ సంరద్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడాలనుకుంటే ఎక్కడో ఉండేవారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన కుటుంబం కక్ష సాధింపులకు గురవుతోందని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ నాయకత్వాన్ని(Congress leadership) బలహీనపరచాలని వేధింపులకు గురిచేస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీపై ఆధారపడి ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతోందని పొన్నం పేర్కొన్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడట్లేదని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను కక్ష సాధింపు ధోరణి మంచిది కాదని హితువు పలికారు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి(Gandhi family) అందగా ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడా, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. మంగళవారం, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది.