calender_icon.png 13 November, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేకు ఇబ్బందులు కల్గిస్తున్నారు.. సరికాదు: మంత్రి పొన్నం

10-11-2024 10:35:22 AM

సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదు.. ఆందోళన వద్దు: మంత్రి పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టం అన్నారు. 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదు.. ఆందోళన చెందవద్దని పొన్నం సూచించారు. సమగ్ర కుటంబ ఇంటింటి సర్వే సమాచారం అంత గోప్యంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లోని కొన్ని చోట్ల సర్వేకు ఇబ్బందులు కల్గిస్తున్నారు.. సరికాదని పొన్నం సూచించారు. సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.