హైదరాబాద్, (విజయక్రాంతి) : బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లోని ఎన్ క్లెవ్ అపార్ట్మెంట్స్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా కల్పించారు. సామాజిక రుగ్మతలు తొలగించడానికే కుటుంబ సర్వే అని మంత్రి వివరించారు.