calender_icon.png 29 November, 2024 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

29-11-2024 01:56:42 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో 20 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన పంచాయతీ రాజ్ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నవాబ్ పేట గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన రజక నూతన భవనాన్ని ప్రారంభించారు. నవాబ్ పేట గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. చిగురు మామిడి మండలం ముదిమానిక్యం లో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో శుక్రవారం సభలో భాగంగా అంగన్ వాడి, ప్రి పైమరి స్కూల్ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు. చిగురు మామిడి -2 కి 12 లక్షలతో అంగన్ వాడి నూతన భవనానికి శంఖు స్థాపన చేశారు. బాల్య వివాహ ముక్త భారత్ పోస్టర్ ఆవిష్కరించారు. గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల దేశాయ్ , హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

చిగురు మామిడి మండల కేంద్రంలో అంగన్ వాడి పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు. శుక్రవారం సభలో మహిళలంతా ఐక్యంగా ఉండి బయట సమాజంలో ఎలా ఉండాలి ఆరోగ్యకరంగా ఎలా  ఉండాలనే దానిపై వారి అనుభవాలను చెప్పారు.