హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో ఏదో ఓ వీడియో తీసుకుని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా అసభ్య కరంగా పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేం పద్ధతి.. సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని వెల్లడించారు.