హుజూరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీకి బీటీమ్ అని ఎప్పటినుంచో చెబుతున్నామని, మహారాష్ట్రలో బీజేపీ గెలిచినందుకు బీఆర్ఎస్ సంతోషిస్తోందా..?, కాంగ్రెస్ ఓడినందుకు బాధపడుతోందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.