calender_icon.png 14 January, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో కలిసి పొన్నం సంబరాలు

01-11-2024 08:04:17 PM

కరీంనగర్,(విజయక్రాంతి): మెస్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆనందోత్సాహల మధ్య టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. మహాత్మజ్యోతి రావు పులే గురుకుల బాలికలు కరీంనగర్ రూరల్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన చేశారు. ప్రభుత్వం  40 శాతం మెస్ చార్జీలు పెంపుదల చేయడంతో తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు కేక్ కట్ చేసి టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్  ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థినులు అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ లో విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సంబరాల్లో పాల్గొన్నారు.