హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ రివ్యూజూమ్ మీటింగ్ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నేను మీ అందరి వాడిని.. అలసత్వం వహిస్తే సహించేది లేదు.. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్ లు తనీఖీలు చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్ తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ చేయాలని సూచించారు. ఆర్థికాభివృద్ధి కోసం ఫెడరేషన్లు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని వెల్లడించారు. విశ్వకర్మ పథకం(Vishwakarma scheme) లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు తెలిపారు.