calender_icon.png 13 February, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి కులగణన ఇష్టం లేదు: మంత్రి పొన్నం

13-02-2025 10:16:34 AM

కులగణనలో పేర్లు నమోదుకు మరో అవకాశం

బీజేపీ వ్యాపారస్తుల పార్టీ: మంత్రి పొన్నం

కులగణనను అవహేళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు

కులగణనను రాజీకీయం చేయవద్దు

హైదరాబాద్: బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు.  కరీంనగర్ నుంచి మంత్రి పొన్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కులగణన(Caste Census Survey)కు వ్యతిరేకంగా బీజేపీ అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శించారు. బీజేపీకి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి(Bharatiya Janata Party) ఇష్టం లేదని మంత్రి పొన్నం ద్వజమెత్తారు. కులగణన తర్వాత బీసీ సంఘాల నేతలతో చర్చించామన్న పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాల నేతల(BC community leaders) అభిప్రాయాలు, సూచనలు సేకరించామని స్పష్టం చేశారు.

బలహీనవర్గాలపై చిత్తశుద్ధి ఉంటే కులగణనపై రాజకీయం చేయవద్దు, బీసీ రిజర్వేషన్ల(BC Reservations)ను అడ్డుకోవడానికి కులగణనను తప్పుబట్టవదని పొన్నం నేతలను కోరారు. రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని 9వ షెడ్యూల్ లో పెట్టేందు కేంద్రం కృషి చేయాలన్నారు. కులగణనలో పేర్లు నమోదు చేసుకునేందుకు మరొక అవకాశమిస్తున్నామని వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణనలో పేర్లు నమోదు చేసుకునే అవకాశమిస్తున్నామని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) అగ్రనాయకులు కులగణన సర్వేలో పాల్గొనలేదని పొన్నం పేర్కొన్నారు. కులగణనలో పాల్గొనకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు.