calender_icon.png 7 October, 2024 | 4:15 AM

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

04-09-2024 11:56:03 AM

మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్

హుస్నాబాద్, (విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద ప్రవాహలు తగిన ప్రత్యామ్నాయాలు చెయ్యాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రకృతి విలయ తాండవం చేస్తున్నప్పుడు మనమందరం జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. రాజకీయం చేసే వారు రాజకీయం చేస్తుంటారు. ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాంఅని అన్నారు. నష్టాన్ని ఏ విధంగా భర్తీ ప్రయత్నం చేస్తున్నాం కేంద్రం నుండి సహకారం కోరుతున్నామన్నారు. అధికారులంతా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ప్రతి కార్యకర్తను కోరారు.