కొండపాక, నవంబర్ 29: కొండపాక మండలకేంద్రంలోని రుద్రేశ్వర ఆలయాన్ని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు ఆయన్ను సాంప్రదాయబద్ధంగా స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంత రం గ్రామంలో పర్యటించి దివంగత ప్రధాని ఇందీరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాలు, సంక్షేమ వసతి గృహలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎక్కడైరా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మనూ చౌదరి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూం కుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.