calender_icon.png 26 December, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం

06-12-2024 12:51:30 PM

హైదరాబాద్: సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆహ్వానం కోసం సమయం ఇవ్వాలని నేతలను కోరామని పొన్నం పేర్కొన్నారు. నేతలు సమయమిస్తే ప్రభుత్వం తరుఫున ఆహ్వానిస్తామన్నారు.

అటు తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో చురుగ్గా పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి తన ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించిన సర్వేలలో ప్రతిపక్ష నాయకులు కూడా విలువైన సమాచారాన్ని అందించారని చెప్పారు. ప్రస్తుత సర్వేలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, పలువురు నేతలు సహా ప్రముఖులు ఇంకా పాల్గొనాల్సి ఉందని ఆయన సూచించారు. ఇప్పటి వరకు సమాచారం అందించని వ్యక్తులు తమ స్థానిక ఎన్యుమరేటర్లను సంప్రదించాలని ప్రభాకర్ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.