calender_icon.png 6 November, 2024 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన మంత్రి పొన్నం

06-11-2024 11:31:33 AM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీలో హెడ్ ఆఫీసులో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్న మాట్లాడుతూ... ప్రభుత్వం ఇంటింటి సర్వే మహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని స్పష్టం చేశారు.

ప్రజలు స్వచ్చందంగా సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. అందరి సలహాల మేరకు సర్వే ప్రశ్నలు రూపొందించామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఇంటింటి సర్వేలో రాష్ట్రం రోల్ మాడల్ గా మారబోతోందని పొన్నం స్పష్టం చేశారు. సర్వే సమయంలో ఎలాంటి పత్రాలు స్వీకరించరని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సర్వేను కొందరు  రాజకీయం చేయాలని చూస్తున్నారని పొన్నం ఆరోపించారు. సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు.

గ్రేటర్ పరిధిలో 27 లక్షల 76 వేల ఇండ్లలో సర్వే నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ లోని మరో 50 వేల ఇండ్లలో సర్వే కొనసాగనుంది. మొత్తం 28 లక్షల 28 వేల ఇండ్లలో సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. ఒక్కో ఎన్యుమరేటర్ కు 150 ఇండ్లు కేటాయించారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారు. డోర్ లాక్ ఉంటే మరోసారి సర్వే వివరాల సేకరిస్తారు. ఈ సర్వలో ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు సర్వేలో వివరాలు ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇండ్లు ఉన్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సర్వే కోసం 87,900 ఎన్యుమరెటర్లు నియామకం అయ్యారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేన్నారు.