కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్(State BC and Transport Minister Ponnam Prabhakar) అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హైదారాబాద్ నుంచి రోడ్డు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్(Road Buildings Department Special Chief Secretary Vikas Raj)తో కలిసి రోడ్డు భద్రత మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేందని, దీని ప్రధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మహోత్సవం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ విసృత్తంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రత ప్రమాదాలపై వేడుకలను ప్రతి గ్రామంలో జరగలని తెలిపారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా, మండల హెడ్ క్వార్టర్‌లో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. అర్‌అండ్‌బి పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు అన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), అధికారులు పాల్గొన్నారు.