calender_icon.png 18 November, 2024 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చేసింది తప్పే: మంత్రి పొన్నం

14-09-2024 02:24:32 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్నవారిపై తాము ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, బీఆర్ఎస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ప్రాంతీయతత్వంపై కేసీఆర్‌ కూడా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నివాసితులను కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ప్రతిపక్షం భంగం కలిగిస్తోందన్న మంత్రి, అరెకపూడి గాంధీ అయినా.. కౌశిక్‌ రెడ్డి అయినా దాడులు చేయడం తప్పే అన్నారు. అధికారం పోవడంతో కేటీఆర్‌ అసహనంతో ఉన్నారు. చిల్లరగాళ్ల గురించి మాట్లాడొద్దని సీఎం చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్ దారుణంగా విమర్శించాని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని సొంత పార్టీ నేత అరెకపూడి అంటున్నారని పొన్నం పేర్కొన్నారు. ప్రాంతీయత్వాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు.