కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని రామగుండం బైపాస్ రోడ్డులో గల రేణుకా ఎల్లమ్మ ఆలయం ఫంక్షన్ హల్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచం (సేఫ్టీ మోకుల) పంపిణీ కార్యక్రమ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులను పంపిణీ చేశారు. అనంతరం సేఫ్టీ మోకు పనితీరుపై గీతా కార్మికులకు చెట్టు ఎక్కి అవగాహన కల్పించిన ట్రైనర్. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , ఆర్డీవో మహేష్ ,ఎక్సైజ్ , బీసీ వెల్ఫేర్ అధికారులు, ఇతర అధికారులు ,గౌడ సంఘం ప్రతినిధులు ఉన్నారు.