calender_icon.png 24 October, 2024 | 2:18 AM

సిద్దిపేటలో జెండావందనం చేస్తున్న మంత్రి పొన్నం, అధికారులు

18-09-2024 01:23:20 AM

సిద్దిపేట, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం సకల మతాల, సంస్కృతుల సమ్మేళనం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరబాద్ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశం హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్దం, జైనం తదితర మతాల సంగమం అయితే ఆయా మతాలకు చెందిన ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారత దేశంలో విలీనమై రాచరిక పాలన నుంచి విముక్తి పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.