calender_icon.png 18 January, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పొన్నం పరామర్శ..

17-01-2025 11:40:41 PM

భీమదేవరపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలుగూరి రాజు కాలు నొప్పితో బాధపడుతుండగా రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని రాజు ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు బొజ్జపురి అశోక్‌ముఖర్జీ, చిట్టంపల్లి అయిలయ్య, చిదురాల స్వరూప, ఆదరి రవి, నరేందర్, రాజు, వరుణ్, శ్రీకాంత్, కిశోర్, శ్రావణ్ తదితరులున్నారు.