calender_icon.png 27 January, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెూండాపై పొంగులేటి.. స్కూటీలో ఆర్ఆర్ఆర్

02-09-2024 12:41:37 PM

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా

ఖమ్మం, (విజయక్రాంతి): హెండా యూనికార్న్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నడుపుతూ.... స్కూటీలో ఆర్ఆర్ఆర్ వెనకాల కూర్చుని ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు వారి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఖచ్చితంగా బాధితులందరినీ ఆదుకుంటామని, ఏ ఒక్కరికి ఇబ్బందులు కలిగించబోమని మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.