24-03-2025 01:24:56 AM
పది ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా
ప్రెస్‌క్లబ్‌కు స్థలం మంజూరు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు
మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు
భద్రాద్రి కొత్తగూడెం. మార్చి 23 (విజయక్రాంతి) జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తగూడెం పర్యటనలో భాగంగా కొత్తగూడెం క్లబ్ కు వచ్చిన మంత్రి పొంగులేటిని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏర్పుల సుధాకర్, జాయింట్ సెక్రటరీ ఎర్ర ఈశ్వర్, సీనియర్ జర్నలిస్టు (వెలుగు )పోతు రాజేందర్, సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ కలిశారు.
జర్నలిస్టులకు కేటాయించిన పది ఎకరాల భూమికి సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జర్నలిస్టుల స్థలాలకు సంబంధించి గజానికి 250 రూపాయల చొప్పున ధర నిర్ణయించి అందించాలని ముఖ్యమంత్రికి సిఫారసు విషయాన్ని ఐజేయు నాయకులు గుర్తు చేయడం జరిగింది. అట్టి విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కు సంబంధించి వెంటనే స్థలాన్ని మంజూరు చేస్తానని హామీ ఇస్తూనే పక్కనే ఉన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు పాల్గొన్నారు