calender_icon.png 3 February, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడా రాణికి మంత్రి పొంగులేటి నివాళి..

02-02-2025 11:11:26 PM

వైరా (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లు వైరా కు చెందిన జర్నలిస్ట్ మేడా సంపత్ కుమార్ మాతృమూర్తి మేడా రాణికి ఆదివారం రాత్రి ఘనంగా నివాళులర్పించారు. మండల పరిధిలోని ఉప్పలమడక గ్రామానికి చేరుకొని మేడా రాణి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర మార్క్ పేడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, మాజీ వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా మత్స్యశాఖ చైర్మన్ షేక్ రహీం, కాంగ్రెస్ నాయకులు పనితి సైదులు తదితరులు పాల్గొన్నారు.