17-04-2025 12:00:00 AM
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి పోర్టల్‌ను జిల్లా లో ప్రారంభించేందుకు రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 18న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే భోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సు ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల కు కలెక్టర్ సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భూ భారతి ఆర్‌ఓఆర్ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, రెవెన్యూ డివిజ నల్ అధికారి వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో ఉన్నారు.