calender_icon.png 22 February, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం, పాలేరు, వైరాలో పొంగులేటి పర్యటన

21-02-2025 12:27:41 AM

ఖమ్మం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) :- తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో  బోడపట్ల నర్సయ్య గౌడ్ కుమార్తె వివాహం ఈ నెల 21న కాగా ముందస్తుగా వారి ఇంటి వద్ద నూతన వధువును ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమ ర్పించారు. ఖమ్మం నగరం ఏడో డివిజన్ టేకులపల్లిలో పొదిల పాపారావు భార్య పార్వతి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొన్నారు.

ఖమ్మం/వైరా, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మా ణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటన లో భాగంగా రఘునాథపాలెం మండలం జింకలగూడెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు, వైరా వాసవి కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. కార్యక్రమాల్లో వైరా ఎంఎల్‌ఏ మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రాష్ర్ట మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, విజయబాయి తదితరులు పాల్గొన్నారు.