07-03-2025 12:58:43 AM
కూసుమంచి , మార్చి 6 (విజయ క్రాంతి): రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు... కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30గంటలకు జరిగే కూసుమంచి, తిరుమలాయపాలెం మండల లబ్ధిదారుల కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవుతారని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. ఆయా మండలాల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సకాలంలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.